ఏఐటీయూసీ తంబళ్లపల్లె నియోజకవర్గ కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ములకలచెరువులో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్య దర్శి సాంబశివ, కార్యదర్శులు గంగాధర్, సురేష్, సీపీఐ మండల కార్యదర్శి అంజనప్ప ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా.. నియోజకవర్గ అధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సలీమ్ బాషా, గౌరవాధ్యక్షుడిగా రెడ్డి మౌలా, ఉపాధ్యక్షులుగా విమల, అలివేలమ్మ, గఫుర్, సుందర్ రాజు, రామాంజులు ఎన్నికయ్యారు.