బాడీ బిల్డింగ్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచిన విజయపురం మండలం మాధవరానికి చెందిన క్రీడాకారుడు వెంకటేష్ ను మాజీ మంత్రి ఆర్కే రోజా గురువారం నగిరి లోని తన స్వగృహంలో అభినందించారు. గత రెండు రోజుల మునుపు మధ్యప్రదేశ్ ఇండోర్ లొ ఎంపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నిర్వహించిన మిస్టర్ ఇండియా జాతీయ బాడీ బిల్డింగ్, మెన్ ఫిజిక్ ఛాంపియన్ షిప్ 60 కేజీల జూనియర్ విభాగంలో జాతీయ స్థాయిలో వెంకటేష్ 2వ స్థానం సాధించాడు.