ఈనెల 20 నుంచి ప్రజల వద్దకు ఎమ్మెల్యే
ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా.. చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఈ నెల 20 నుంచి 26 వరకు నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్నటువంటి ప్రజల్లోకి వెళతారని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు సాగుతారని ముఖ్య నాయకులు తెలియజేశారు.