నగిరి: విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, వడమాలపేట మండలం, కల్లూరు పాఠశాలలో మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కలవడానికి కార్యకర్తలు , నాయకులు వచ్చేటప్పుడు శాలువాలు, పూలమాలలు తీసుకొని రావద్దన్నారు. దానికి బదులుగా విద్యార్థులకు పుస్తకాలను అందిస్తే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.