పలమనేరు: ఉరి వేసుకుని టీచర్ ఆత్మహత్య

82చూసినవారు
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఓ టీచర్ ఉరేసుకుని చనిపోయారు. పలమనేరు మండలం శ్రీరంగరాజపురానికి చెందిన శ్రీనివాసులు శర్మ(54) టీచర్గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో తాను పనిచేసే పలమనేరులోని రాచమడుగు రంగయ్య శెట్టి స్కూల్ వద్దకు శనివారం వచ్చారు. ఆ తర్వాత పాఠశాలలోనే ఉరేసుకుని చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్