పలమనేరు మండలంలోని గుడియాత్తం రోడ్డు ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. బెంగళూరు నుంచి వేలూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగిందని కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందజేయగా దర్యాప్తు చేస్తున్నారు.