ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలి
పీలేరు, కలికిరి మండలంలో నిర్వహించ తలపెట్టిన, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారని ఎంపీడీవో సీ. గంగయ్య తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 9: 30 గంటలకు కలికిరి గ్రామ పంచాయతీ కార్యాలయం, మరియు మద్యాహ్నం 3: 30 గంటలకు గుట్టపాళెం ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.