రాయచోటి నుండి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్రంకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25 టన్నుల రేషన్ బియ్యం పట్టుకుని కేసు నమోదు చేయకుండా బేరసారాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడంపై పోలీసులను ప్రజలు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.