భారీ వర్షానికి స్తంభించిన రాకపోకలు

4226చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ మండలంలో 84. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా సీతమ్మ చెరువు వంక నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో చౌడేపల్లి నుంచి పెద్దఉప్పరపల్లెకు వెళ్లే మార్గంలో రాకపోకలు కొన్ని గంటలపాటు పూర్తిగా స్తంభించాయి.

సంబంధిత పోస్ట్