సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం బ్రాహ్మణ తంగేల్ గ్రామ పంచాయితీలో అక్రమంగా ఆక్రమించుకుని ప్రహరీ గోడ కట్టారని 5వ వార్డు మెంబర్ కన్నదాస్ తెలిపారు. బుధవారం ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. లేని పక్షంలో కలెక్టర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.