శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాపా నాయుడు పేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సోమవారం ఎయిడ్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నంద్యాల వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ.. ప్రజలలో అవగాహన పెంపొందించడంతోనే ఎయిడ్స్ వ్యాధి తీవ్రత తగ్గిపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకట సురేష్, జలగం రామాంజులు, శంకరప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.