ఫ్లెమింగో ఫెస్టివల్ ను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి ఆయన సందర్శించారు. ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పక్షుల కేంద్రంలో పక్షులను వారు సందర్శించారు. పక్షుల కేంద్రాన్ని సందర్శించే నాయకులకు, పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.