కురబలకోట ఎంపీడీఓ ఆఫీసు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ కొండయ్య నాయుడు నేతృత్వంలో శుక్రవారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు మండల మీట్ నిర్వహించనుండగా, కూటమి నేతలు అడ్డుకోవకుండా పోలీసులు 30 యాక్ట్ అమలు చేశారు.