ములకలచెరువు మండలం మద్దినాయనపల్లె సచివాలయం-2లో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ రషీద్ ఖాన్, తహసీల్దార్ ప్రదీప్ కుమార్, సర్పంచ్ వెంకటరమణ నాయుడు ఆధ్వర్యంలో అధికారులు ప్రజలు, రైతుల నుంచి భూ, రెవెన్యూ, ఇతరత్రా సమస్యలపై వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ వెబ్ సైటులో నమోదు చేసి అర్జీదారులకు రసీదులు ఇచ్చారు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మార్వో చెప్పారు.