తిరుమలలో బంగారు రంగు కారు హల్ చల్

56చూసినవారు
తిరుమలలో తమిళనాడుకు చెందిన భక్తుడు బంగారు వర్ణంలోని కారుతో హల్ చల్ చేశారు. తిరువల్లూరుకు చెందిన బంగారు వ్యాపారి బాలమురుగన్ మంగళవారం శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్థానిక రాంభగీచా అతిథి గృహాల ఎదుట కారును ఆపడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. తాను బంగారు వ్యాపారి కావడంతో తనకు నచ్చినట్లు కోటింగ్ తో కారును సిద్ధం చేయించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్