తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సోమవారం 7 గొడుగులు కానుకగా అందాయి. తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్ కార్యదర్శి ఆర్‌ఆర్. గోపాల్‌జి ఆధ్వర్యంలో 5గొడుగులను తీసుకొచ్చారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడుకు అందించారు.