తిరుమలలో కోడిగుడ్లతో కూడిన పలావ్ ఆహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన కొందరు శనివారం రాంభగీచ బస్టాండ్ వద్ద ఆహారాన్ని తింటుండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. తిరుమలలో నాన్ వెజ్ తినకూడదనే రూల్ ఉందని చెప్పారు. తిరుమలలో నాన్ వెజ్ తినకూడదని మాకు తెలియదు. ఫస్ట్ టైం చేసిన తప్పుగా భావించి మమ్మల్ని మన్నించండి అంటూ వాళ్లు క్షమాపణలు కోరారు.