తిరుపతిలోని ప్రకాశం పార్కులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రకాశం పార్కును శాప్ చైర్మన్ రవినాయుడు, కార్పొరేషన్ కమిషనర్ మౌర్య శుభ్రం చేశారు. శెట్టిపల్లిలో కలెక్టర్ వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. సీఎం చంద్రబాబు లక్ష్యం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.