ఊటీ, కొడైకెనాల్ ని తలపిస్తున్న తిరుమల
తిరుమల కనుమదారుల్లో వాతావరణం ఊటీ, కొడైకెనాల్ని తలపిస్తోంది. కొండ కోనల నడుమ ఘాట్ రోడ్డు, ప్రకృతి అందాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కొండలోయల సోయగాలు భక్తులను మైమరింపజేస్తున్నాయి. అసలే శీతల వాతావరణంతో ఉన్న తిరుమలలో మంగళవారం వేకువజామున నుంచి మోస్తరు వర్షం కురిసింది. చిరుజల్లులతో చలి తీవ్రత పెరగటంతో భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.