తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని అడ్డ రోడ్డు వద్ద పోలేరమ్మ ఆర్చి పనులు చేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సోమవారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. ఆర్చి పనులు పూర్తి అయ్యే వరకు లారీలు, వ్యాన్లు, బస్సులు తదితర భారీ వాహనాలు పాలకేంద్రం మీదుగా పట్టణంలోకి వెళ్లాలని సూచించారు. పనులు పూర్తయ్యే వరకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.