బిక్కవోలు మండలం పందలపాక లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని గురువారం శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ముందుగా టిడిపి జెండాను ఎగరవేసి అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు.