గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై గురువారం జగ్గంపేట వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే మార్గంలో రెండు బైకులు ఢీకొన్నాయి. హైవే మొబైల్ పోలీసులు వివరాల ప్రకారం ముందు వెళ్తున్న పల్సర్ బైక్ ను వెనక వస్తున్న గ్లామర్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని గండేపల్లి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.