ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంకల్ప కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని నిడదవోలు మోడరన్ రూఫ్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గీతాంజలి అన్నారు. సంకల్ప 2025 కార్యక్రమంలో భాగంగా కళాశాలలో సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షకీరా బేగం, ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.