ఉమ్మడి తూ. గో జిల్లాలోని అన్ని కోర్టుల వద్ద ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత తెలిపారు. గురువారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తారని చెప్పారు.