అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్య క్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అధికారులకు వారి సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజా సమస్యలపై 115 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు.