అమలాపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు 335 అర్జీలు

78చూసినవారు
అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 335 అర్జీలు వచ్చాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలను స్వీకరించారు. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్