అమలాపురం: "లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి"

82చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం గర్భస్థలింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై వైద్యారోగ్య శాఖ, పోలీస్, ఐసీడీఎస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్