అమలాపురం: ఇంధన వనరులను పరిరక్షించుకోవాలి

83చూసినవారు
ఇంధన వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ట్రాన్స్ కో ఎస్. రాజబాబు అన్నారు. అమలాపురంలో ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకొని ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విచ్చలవిడిగా ఇంధన వనరులను వినియోగించడంతో భవిష్యత్తులో వీటి వినియోగం ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. ఇంధనాలైనా పెట్రోలు, బొగ్గు, డీజిల్, అను ఇంధనాలు ప్రకృతి నుంచి పరిమితంగా లభిస్తాయని ప్రజలు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్