కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని జాయింట్ కలెక్టర్ నిశాంతి అభినందించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె సిబ్బందిని అభినందించి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రబీ సీజన్లో కూడా ధాన్యం సేకరణలో కోనసీమ జిల్లాను ముందంజలో నిలపడానికి కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.