కోనసీమ జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలకు సంసిద్ధం చేయడానికి ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీఈవో షేక్ షలీన్ భాష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన అమలాపురం నుంచి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి విద్యా శాఖ వివిధ చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులు పూర్తి ఉత్తీర్ణత సాధించడమే తమ లక్ష్యం అని ప్రకటనలో పేర్కొన్నారు.