అమలాపురం: విలేజ్ సర్వేయర్లకు డ్రోన్ ఆపరేషన్లో శిక్షణ పూర్తి

65చూసినవారు
అమలాపురం: విలేజ్ సర్వేయర్లకు డ్రోన్ ఆపరేషన్లో శిక్షణ పూర్తి
కోనసీమ జిల్లాలో 32 మంది విలేజ్ సర్వేయర్లకు డ్రోన్ ఆపరేషన్లపై శిక్షణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద శనివారం ఆయన డ్రోన్లను ఎగరవేయడంలో శిక్షణ పూర్తి చేసుకున్న విలేజ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లను, లైసెన్సులను అందజేసి అభినందించారు. డ్రోన్ టెక్నాలజీ ప్రస్తుత ఆధునిక యుగంలో అత్యంత కీలకంగా మారిందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్