ఉప్పలగుప్తంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు

76చూసినవారు
సాగునీటి సమస్యను నిరసిస్తూ ఉప్పలగుప్తంలో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. సాగునీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. సాగునీరు అడిగితే రైతులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్