పవిత్ర రంజాన్ పండుగ త్యాగానికి సహనానికి ప్రతీకగా నిలుస్తుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమలాపురంలోని అబుల్ కలాం ఆజాద్ ముస్లిం సాధికార వద్ద మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.