అమలాపురం పట్టణం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమలాపురం డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అల్లాడ స్వామి నాయుడును నియమించడం పట్ల ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 18న జరగబోయే స్వామినాయుడు ప్రమాణ స్వీకారంకి రాష్ట్రపార్టీ నేతలు, మంత్రులు హాజరవుతారని అన్నారు.