సీఎం చంద్రబాబును అమరావతిలోని సచివాలయం వద్ద అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లాలోని రహదారుల అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పై ప్రత్యేక చొరవ చూపి పూర్తి చేయాలని కోరుతూ వాటి వివరాలను తెలియజేశారు. ఈ మేరకు తాను తెలియజేసిన సమస్యలపై పరిష్కారం చూపుతానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎంపీ హరీశ్ తెలిపారు.