జగ్గంపేట: తాగి వాహనాలు నడిపిన పది మందిపై కేసు

70చూసినవారు
జగ్గంపేట: తాగి వాహనాలు నడిపిన పది మందిపై కేసు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో తాగి వాహనం నడుపుతున్న పది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ పదిమందిపై కేసు నమోదుచేసి సోమవారం పెద్దాపురం కోర్టుకు హాజరపరిచినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరికి ఒక్కొక్కరికి పదివేలు చొప్పున రూ. 20 వేలు జరిమానా, 8 మందికి రెండు రోజులపాటు జైలు శిక్షను విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్