జగ్గంపేట మండలం మల్లిసాల శివారు గోవిందపురం మార్గంలో నాటుసారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. ఈ దాడుల్లో భాగంగా వై. అప్పికొండ నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రంలో 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.