కాకినాడ వామపక్షాల ఆధ్వర్యంలో అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన

82చూసినవారు
కాకినాడ వామపక్షాల ఆధ్వర్యంలో అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల అనుచితంగా, అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాల నాయకులు విమర్శించారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ ఆదివారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్