ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి హాజరై, కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు.