పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అన్నారు. ఆయన కరప గ్రామంలోని మార్కెట్ సెంటర్ వద్ద అధికారులు శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.