మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్య జీవనం గడుపవచ్చునని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్స్ , ది టీమ్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన పై2 కె నడక ను సోమవారం నాగమల్లి తోట టీమ్ హాస్పిటల్ నందునిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ వ్యాయామం, పోషకాలు కలిగిన సంప్రదాయ ఆహారం తీసుకోవాలని అన్నారు.