కరప మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోలు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తహశీల్దార్ నందిపాటి సత్యనారాయణ, వ్యవసాయ అధికారి రాజేష్, పౌరసరఫరాల శాఖ టెక్నీషియన్లు ఈ శిక్షణ ఇచ్చారు. 16 రైతు సేవా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి ధాన్యంలో తేమ శాతం ఎలా పరిశీలించాలి, గోనె సంచుల సరఫరా, రవాణా ఛార్జీల చెల్లింపు తదితర అంశాలపై ఈ శిక్షణా కార్యక్రమం జరిగిందని అధికారులు వెల్లడించారు.