జన సేన పార్టీ ఉమ్మడి తూ. గో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ , జన సేన పి. ఏ. సి సభ్యులు ముత్తా శశిధర్, పంతం నానాజీ కాకినాడ హెలికాన్ టైమ్స్ లో
మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ జన సేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్
వారాహి యాత్ర ప్రారంభం అని ప్రకటించిన వెంటనే
జనసేన సైనికులు , వీర మహిళలు, ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు 14 వ తేది ఉదయం 9 గంటలకు అన్నవరం లో సత్యనారాయణ స్వామీ దర్శనం అనంతరం సాయంత్రం 5 గంటలకు కత్తిపూడి లో
వారాహి నుండి బహిరంగ సభ నిర్వహించి
వారాహి యాత్రకు అంకురార్పణ చేస్తారని తెలిపారు. స్థానికంగా ఉండే సమస్యలు, చేతి వృత్తులు వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకుని, మత్స్య కారులు సమస్యలు, గ్రహించి జనవాణి కార్యక్రమం ద్వారా అర్జీలు తీసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఆ సమస్యల పరిష్కారానికి
వారాహి వాటికి సంబంధించి మాట్లాడతారు. కాకినాడ జిల్లా తొలిసభ కత్తిపూడి అనంతరం కాకినాడ , మమ్మిది డి వరం, పి. గన్నవరం లో రోడ్ షో ల ద్వారా యాత్ర సాగుతుందని తెలియజేశారు.
వారాహి నుండి ప్రసంగించే సభాలకు యాత్ర కార్యక్రమాలకు వేలాది మంది వాలంటరీ , సెంట్రల్ నుండి కొన్ని కమిటీలు, మీడియా కమిటీ, వాలంటరీ కమిటీ, జిల్లా లో ఉన్న అన్ని శక్తులు ఉపయోగించి
వారాహి యాత్ర విజయవంతం చేయడానికి కార్యచరణ సిద్దం చేశామని తెలిపారు. పోలీస్ శాఖ నుండి యాత్ర కు సంబందించి అన్ని అనుమతులు కోరుతూ ఇప్పటికే జిల్లా ఎస్పీ నీ కోరామని, పోలీస్ శాఖ నుండి అన్ని అనుమతులు మంజూరు చేశారని తెలిపారు.