ఆలమూరు: దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలి

60చూసినవారు
ఆలమూరు: దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలి
దివ్యాంగ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మన్యూనతా భావాలకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. నరసింహ స్వామి ఉద్బోధించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రతిభాపాటవాలకు, సృజనాత్మక శక్తులకు ఎలాంటి కొరత ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్