మండపేట సంఘం పుంత రోడ్ లోని పురపాలక సంఘం కంపోస్ట్ యార్డులో ఆదివారం చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. మునిసిపల్ డి ఇ శ్రీనివాస్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సమస్య పరిష్కారం కావడం తో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.