సంఘ సంస్కర్త, విద్యాదాత, స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 172వ జయంతి సందర్భంగా మండపేట శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శెట్టిబలిజ కళ్యాణ మండపంలో ఆదివారం పట్టణ అధ్యక్షులు పంపన శ్రీనివాస్ అధ్యక్షతన నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఐక్యతతో అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్లాలని సంఘం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు.