వాటర్ ట్యాంక్ ఎక్కి సర్పంచ్, ఆమె భర్త నిరసన

67చూసినవారు
మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో 10 రోజుల నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోలేదని గ్రామ సర్పంచ్ అల్లు విజయలక్ష్మి, ఆమె భర్త సురేష్ బాబు శనివారం ఆందోళన చేపట్టారు. వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలిపారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్