యానంలో హనుమద్ వ్రతం సందర్భంగా పలు ఆలయాల్లో విశేష పూజ నిర్వహించారు. దొమ్మేటి పేటలో శ్రీ కనకదుర్గ దేవి ఆలయం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమద్ వ్రతం శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు కిరణ్ శర్మ బ్రహ్మాత్వంలో పంచామృత అభిషేకాలు, సింధూరం, తమలపాకు పూజలు నిర్వహించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.