గొల్లప్రోలు మండలంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా
గొల్లప్రోలు పట్టణంలో గ్రోమోర్ లో విజిలెన్స్ అధికారులు దాడి చేసి 3, 60, 000 విలువైన ఎరువులను సీజ్ చేశారు. 200 బస్తాలుకు ఇన్వాయిస్ లేకపోవడంతో 6ఏ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీఐ నాగ వెంకట్ రాజు, ఏవో మధుసూదన్, గొల్లప్రోలు వ్యవసాయాధికారి సత్యనారాయణ, తూనికలు కొలతలు అధికారి సరోజిని, వల్లి, లోవరాజు ఉన్నారు.