పిఠాపురంలో పాడా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి అర్జీలు భారీగా వచ్చాయి. వివిధ శాఖలకు సంబంధించి 90 అర్జీలు వచ్చినట్లు పాడా డైరెక్టర్ చైత్రవర్షిని తెలిపారు. రెవెన్యూ, 31 మున్సిపాలిటీ, 20 పింఛన్లు, 11 అగ్రికల్చర్, 5 ఇతర శాఖలకు సంబంధించి 23 అర్జీలు వచ్చాయని అర్జీలను త్వరగా పరిష్కరించాలని శాఖ అధికారులకు డైరెక్టర్ చైత్రవర్షిని ఆదేశాలు జారీ చేశారు.